బిగ్ బాస్ ఫేం కు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
- March 09, 2021హైదరాబాద్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ దేత్తడి హారిక(అలేఖ్య హారిక)కు ఆ డిపార్ట్మెంట్ షాకిచ్చింది. ఆమె వివరాలను తమ శాఖ వెబ్ సైట్ నుంచి మంగళవారం తొలగించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామక పత్రాన్ని ఆమె సోమవారం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంవో అధికారులకు సమాచారమివ్వకుండానే శ్రీనివాస్ గుప్తా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడంతో ఇలా జరిగిందని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. ఈ మేరకు శ్రీనివాస్ గుప్తాను సీఎంవో అధికారులు మందలించినట్టు తెలిసింది.
యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హారిక.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ షోతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. తెలంగాణ అమ్మాయి కావడంతో టూరిజం అంబాసిడర్‌గా ఆమెను శ్రీనివాస్ గుప్తా నియమించారని సమాచారం. అయితే శాఖా పరమైన అనుమతులు తీసుకోకపోవడంతో తొలగించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ