'శశి' ట్రైలర్ విడుదల...
- March 10, 2021హైదరాబాద్:ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం 'శశి'. సురభి నాయికగా నటించిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీనివాస్ నాయుడు దర్శకుడు. పవన్ కళ్యాన్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్ తో పాటు 'ఒకే ఒక లోకం నువ్వే' పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోందని, ట్రైలర్ కూడా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు,చింతలపూడి శ్రీనివాస్ చెబుతున్నారు. 'మనం ప్రేమించే వాళ్ళు పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అనే ఆది డైలాగ్ తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. ఇక 'మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, ముందు మన బలహీనతలను గెలవాలి'... 'ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం'... 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.ఈ పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కి కూడా ఇందులో చోటు కల్పించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి