కోవిడ్ రూల్స్ బ్రేక్..జిమ్ ట్రైనర్ కు జైలు శిక్ష, జరిమానా

- March 12, 2021 , by Maagulf
కోవిడ్ రూల్స్ బ్రేక్..జిమ్ ట్రైనర్ కు జైలు శిక్ష, జరిమానా

బహ్రెయిన్:బహ్రెయిన్లో కోవిడ్ రూల్స్ ను ఉల్లంఘించిన జిమ్ ట్రైనర్ కు జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది కోర్టు. అలాగే జిమ్ ఓనర్ కు కూడా జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు జిమ్ములు, స్విమ్మింగ్ పూల్ నిర్వహణపై స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విధిగా ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు..భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించాల్సి ఉంటుంది. అయితే..ప్రస్తుతం కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన జిమ్ లో ఏకంగా కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను కూడా అనుమతించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో బహ్రెయిన్ ఆరోగ్య శాఖ అధికారులు జిమ్ లో తనిఖీలు చేపట్టారు. జిమ్ములో పరిమితి సంఖ్యకు మించి ఎక్కువ సంఖ్యలో జనాలను అనుమతించారని, భౌతిక దూరం పాటించలేదని, ఎవరికి ఫేస్ మాస్కులు కూడా లేవని తమ తనిఖీల్లో నిర్ధారణ అయినట్లు అధికారులు వివరించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జిమ్ ట్రైనర్, జిమ్ ఓనర్ ను కోర్టు ముందు హజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ప్రవాసీయుడైన జిమ్ ట్రైనర్ కు ఏడాది జైలుశిక్షతో పాటు 3,000 దినార్ల జరిమానా విధించింది. అలాగే జిమ్ ఓనర్ కు కూడా 3,000 దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com