వ్యాక్సినేషన్ సెంటర్లకు క్యూ కడుతున్న జనాలు

- March 13, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ సెంటర్లకు క్యూ కడుతున్న జనాలు

కువైట్ సిటీ:కోవిడ్ వ్యాక్సినేషన్ కు కువైట్లో విశేష స్పందన కనిపిస్తోంది. కోవిడ్ కు విరుగుడుగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ కోసం జనం అంచనాలకు మించి ముందుకు వస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కర్ఫ్యూ ఆంక్షల సమయంలోనూ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి కువైట్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారానే కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవటంతో పాటు సమాజ ఆరోగ్య భద్రతకు దోహపడినవాళ్లం అవుతామని పిలుపునిచ్చింది. ప్రజల ఆరోగ్య సంరక్షణకు అన్ని విధాల పరిశీలించిన తర్వాతే కోవిడ్ వ్యాక్సిన్ కు అనుమతించామని, అపోహాలను పట్టించుకోకుండా ప్రజలు ఎక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించటం హర్షించదగ్గ విషయమని అభిప్రాయపడింది. కువైతీయులు, ప్రవాసీయులకు అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు వ్యాక్సినేషన్ కేంద్రాల్లోని ఆరోగ్య సిబ్బంది అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com