అమలులోకి వలస కార్మికుల సంస్కరణ తీర్మానాలు

- March 14, 2021 , by Maagulf
అమలులోకి వలస కార్మికుల సంస్కరణ తీర్మానాలు

సౌదీ: సౌదీ అరేబియాలోని వలస కార్మికులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వలస కార్మిక సంస్కరణ తీర్మానాలు ఈ నెల 14(ఆదివారం) నుంచి అమలులోకి రానున్నాయి. ఇన్నాళ్లు వలస కార్మికులు తాము పని చేస్తున్న సంస్థ నుంచి ఇతర సంస్థలకు మారాలనుకుంటే యజమాని అనుమతి తప్పనిసరి. అలాగే దేశం విడిచి వెళ్లాలనుకున్నా యజమాని అనుమతి అవసరం ఉండేది. కానీ, సౌదీ ప్రభుత్వం చేపట్టిన కార్మిక సంస్కరణలతో ఇక నుంచి వలస కార్మికులు అలాంటి ఇబ్బందులు ఉండబోవు. యజమాని అనుమతి లేకుండానే కార్మికులు ఇతర కంపెనీలకు మారొచ్చు..డొమస్టిక్ వర్కర్లు వేరే యజమాని దగ్గర పనికి చేరవచ్చు. యజమాని అనుమతి ఇవ్వకున్నా దర్జాగా దేశం విడిచి సొంత దేశానికి వెళ్లవచ్చు. ఒక యజమాని దగ్గర్నుంచి వేరే యజమాని దగ్గరికి మారాలన్నా, సొంతదేశం వెళ్లిపోవాలన్నా ఇక నుంచి ప్రభుత్వ సేవలను నేరుగా పొందవచ్చు. ఇందుకోసం డిజిటలైజ్ ఉద్యోగ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకుంటుంది. సౌదీ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్మక సంస్కరణలతో దాదాపు 10 లక్షల మంది వలస కార్మికులు లబ్ధి పొందనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com