నేడు కువైట్ కు 8వ విడత ఫైజర్ వ్యాక్సిన్..నెలాఖరులో ఆస్ట్రాజెనెకా

- March 14, 2021 , by Maagulf
నేడు కువైట్ కు 8వ విడత ఫైజర్ వ్యాక్సిన్..నెలాఖరులో ఆస్ట్రాజెనెకా

కువైట్: కోవిడ్ కు విరుగుడుగా అందుబాటులోకి వచ్చిన బయోన్టెక్ ఫైజర్ వ్యాక్సిన్, అస్ట్రాజెనెకా తదుపరి బ్యాచ్ లు కువైట్ చేరుకోనున్నాయి. ఇప్పటికే ఏడు బ్యాచులుగా ఫైజర్ వ్యాక్సిన్ కువైట్ కు చేరుకోగా...నేడు 8వ బ్యాచ్ దిగుమతి కానుంది. అలాగే భారత ఉత్పత్తి కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా తదుపరి బ్యాచ్ ఈ నెలాఖరులోగా వస్తుందని అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే మరికొన్ని వ్యాక్సిన్ కంపెనీలకు అనుమతి ఇచ్చేందుకు కువైట్ వ్యాక్సిన్ కమిటీ వాటి ప్రభావశీలతను అధ్యాయనం చేస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తి వ్యాక్సిన్ కు ఇప్పటికే ఫత్వా అండ్ లెజిస్లేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం లభించిందిన విషయం తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com