ఆరు రంగాలకు కార్మిక సంస్కరణల వర్తించవని సౌదీ క్లారిటీ

- March 16, 2021 , by Maagulf
ఆరు రంగాలకు కార్మిక సంస్కరణల వర్తించవని సౌదీ క్లారిటీ

సౌదీ:దేశంలో కార్మికశక్తిని పటిష్టం చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్న సౌదీ ప్రభుత్వం..పలు కార్మిక సంస్కరణ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలస కార్మికులను ఆకర్షించేందుకు నిబంధనలను సరళతరం చేస్తూ యజమాని అనుమతి లేకుండానే ఉద్యోగం మారటం, ఎగ్జిట్, రీఎంట్రీ వీసాల జారీ, శాశ్వతంగా దేశం విడిచి వెళ్లేందుకు కూడా కార్మికుడు యజమాని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సౌదీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఆదివారం నుంచే ఈ తీర్మానం అమలులోకి వచ్చింది కూడా. అయితే..ఈ సంస్కరణల జాబితాలో ఆరు రంగాల్లోకి కార్మికులకు చోటు లేదని సౌదీ స్పష్టం చేసింది. యజమాని కుటుంబ సభ్యులతో నడిచే కంపెనీలు(కార్మికులు లేకుండా కుటుంబ సభ్యులతో మాత్రమే కొనసాగే సంస్థలు), క్లబ్స్, స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్లేయర్లు, కోచ్ లకు కార్మిక సంస్కరణల ద్వారా కలిగే వెసులుబాట్లు వర్తించవు. అలాగే గృహ కార్మికులు, అదే కోవకు చెందిన వ్యవసాయ కార్మికులు, గొర్రెల కాపరులు, తోటమాలి వంటి కార్మికులకు కూడా సంస్కరణ జాబితాలోకి రారు. ఇక కేవలం రెండు నెలలు అంతకంటే తక్కువ సమయానికి గాను సౌదీలో పని చేసే వలస కార్మికులు, 500 టన్నుల కంటే తక్కువ సామర్ధ్యం కలిగిన షిప్పులలో పని చేసే కార్మికులకు కూడా సంస్కరణల వెసులుబాటు వర్తించదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com