ఆరు రంగాలకు కార్మిక సంస్కరణల వర్తించవని సౌదీ క్లారిటీ
- March 16, 2021సౌదీ:దేశంలో కార్మికశక్తిని పటిష్టం చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్న సౌదీ ప్రభుత్వం..పలు కార్మిక సంస్కరణ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలస కార్మికులను ఆకర్షించేందుకు నిబంధనలను సరళతరం చేస్తూ యజమాని అనుమతి లేకుండానే ఉద్యోగం మారటం, ఎగ్జిట్, రీఎంట్రీ వీసాల జారీ, శాశ్వతంగా దేశం విడిచి వెళ్లేందుకు కూడా కార్మికుడు యజమాని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సౌదీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఆదివారం నుంచే ఈ తీర్మానం అమలులోకి వచ్చింది కూడా. అయితే..ఈ సంస్కరణల జాబితాలో ఆరు రంగాల్లోకి కార్మికులకు చోటు లేదని సౌదీ స్పష్టం చేసింది. యజమాని కుటుంబ సభ్యులతో నడిచే కంపెనీలు(కార్మికులు లేకుండా కుటుంబ సభ్యులతో మాత్రమే కొనసాగే సంస్థలు), క్లబ్స్, స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్లేయర్లు, కోచ్ లకు కార్మిక సంస్కరణల ద్వారా కలిగే వెసులుబాట్లు వర్తించవు. అలాగే గృహ కార్మికులు, అదే కోవకు చెందిన వ్యవసాయ కార్మికులు, గొర్రెల కాపరులు, తోటమాలి వంటి కార్మికులకు కూడా సంస్కరణ జాబితాలోకి రారు. ఇక కేవలం రెండు నెలలు అంతకంటే తక్కువ సమయానికి గాను సౌదీలో పని చేసే వలస కార్మికులు, 500 టన్నుల కంటే తక్కువ సామర్ధ్యం కలిగిన షిప్పులలో పని చేసే కార్మికులకు కూడా సంస్కరణల వెసులుబాటు వర్తించదు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం