లోక్ సభ లో గళమెత్తినవిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

- March 16, 2021 , by Maagulf
లోక్ సభ లో గళమెత్తినవిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

* ఆంధ్రాలో  పెండింగ్ లో ఉన్న 13 మెడికల్ కాలేజీ ల నిర్మాణాలకు ఆర్ధిక సహాయాన్ని అందించండి. 
*ప్రధమ శ్రేణి నగరాలలో పబ్లిక్ ఆసుపత్రుల స్థాపనకు చొరవ చూపండి. 
*ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య రంగ లో ప్రత్యేక అవశ్యకతల గురించి లోక్ సభలో  ప్రస్తావన. 

న్యూ ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్న 13 మెడికల్ కాలేజ్ ల నిర్మాణాలకు సంబంధించి ఆర్ధిక సహాయాన్ని అందించాలని విశాఖ ఎంపీ ఎంవీ వీ సత్యనారాయణ అన్నారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ లో వైద్య అవసరాలకు సంబంధించి మెడికల్ కాలేజీ ల అవశ్యకతను ప్రస్తుతించారు. విభజన తదుపరి రూపుదిద్దుకున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రథమ శ్రేణి మినహా, ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ సెక్టార్ లో మాత్రమే అంతంత మాత్రంగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసులు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ సెక్టార్ లో పలు నిర్మాణాల అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయం పై ఇప్పటికే దృష్టి సారించి, ప్రజారోగ్యాన్ని పరిగణలో కి తీసుకుని నాణ్యమైన వైద్యాన్ని, తక్కువ ఖర్చుతో అందిస్తోందన్నారు. ఈ క్రమంలో పేద ప్రజల వైద్యాన్ని దృష్టి లో  ఉంచుకుని  ఆంధ్రప్రభుత్వం వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ ప్రోగ్రాం ద్వారా విస్కృత సేవలు అందిస్తోందన్నారు.

ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 16 నూతన మెడికల్ కాలేజీ లను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధంచేయగా , అందులో కేంద్రప్రభుత్వం మూడు నూతన కాలేజీ ల స్థాపనకు పచ్చజెండా ఊపడం సంతోషకరమన్నారు. తక్కిన 13 కాలేజీ ల స్థాపనకు మరింత చొరవచూపి ఆర్ధిక సహాయాన్ని అందించాలని ఎంపీ ఈ సందర్భంగా కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com