మహేష్ తో జాన్వీ జత కడుతుందా?!
- March 16, 2021
సూపర్ స్టార్ కృష్ణ, అలనాటి అందాల తార శ్రీదేవి కలిసి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా నటించే వీరి సినిమాలను అభిమానులు పోటీపడి మరీ చూసేవారు. అప్పట్లో వీరి జోడీకి అంత క్రేజ్ ఉండేది. ఇదిలా వుంటే కృష్ణ కుమారుడు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జోడీగా నటించనున్నట్లు ఫిల్మీ దునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించనన్నట్లు టాక్. పైగా ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నారట. షూటింగ్‌ను కూడా సాగదీయకుండా కేవలం రెండు నెలల్లోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ముందుకెళ్తుంది? అసలు పట్టాలెక్కుతుందా? లేదా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే!
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







