కియా కార్ల కంపెనీలో ఉద్యోగావకాశాలు..
- March 16, 2021ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC)మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని పెనుగొండలోని కియా కార్ల కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. ఏదైనా విభాగంలో డిప్లొమో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్తో పాటు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. అభ్యర్థులకు 18-25 ఏళ్ల వయసు ఉండాలి.ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లిస్తారు.ఇంటర్వ్యూ వివరాలు: ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 16న ఉదయం 9 గంటలకు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్ధులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపడతారు.కాబట్టి అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ప్రిపేరై వెళితే ఫలితం ఉంటుంది. ఇతర వివరాలకు 8074370846,9848819682,7981938644 నంబర్లలో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు