BREAKING..2021 ను 'Year of 50th' గా ప్రకటన

- March 16, 2021 , by Maagulf
BREAKING..2021 ను \'Year of 50th\' గా ప్రకటన

యూఏఈ: యూఏఈ స్థాపించి 50 వసంతాలు పూర్తవ్వనున్న సందర్భంగా 2021 ను 'ఇయర్ ఆఫ్ 50th' అని ప్రకటించారు యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. 

50వ సంవత్సరం అధికారికంగా 2021 ఏప్రిల్ 6 న ప్రారంభమయ్యి 2022 మార్చి 31 వరకు ఉంటుంది.

గోల్డెన్ జూబ్లీ కమిటీ ఏర్పాటు..
యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2019 డిసెంబర్‌లో గోల్డెన్ జూబ్లీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కు విదేశీ వ్యవహారాల, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధ్యక్షత వహించగా డిప్యూటీ చైర్‌మెన్‌గా షేఖా మరియం బింట్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా కార్యక్రమాలు, కార్యకలాపాలు మరియు గొప్ప వేడుకలను ప్రారంభించే బాధ్యతను ఈ కమిటీ నిర్వహిస్తుంది.

చారిత్రక క్షణం..
"50 వ సంవత్సరం..1971 లో యూఏఈ యూనియన్ ప్రకటించిన తదుపరి చారిత్రాత్మక ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. జాతిపిత షేక్ జాయేద్ కన్న కలలు, ఆయన సంకల్పం నేడు యూఏఈ ను వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలిచేట్టుచేసింది. దేశాభివృద్ధిలో మాతో తోడుగా నిలిచిన విదేశీ పౌరుల ప్రయత్నాలు సాటిలేనివి. 50 ఏళ్ళకు పైగా సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే శతాబ్ది కి అభివృద్ధి ప్రణాళికను సన్నద్ధంచేసుకోవటమే ఈ 'ఇయర్ ఆఫ్ 50th' ఉద్దేశ్యం అని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అన్నారు.

యువతకు పెద్దపీట..
"మనం వేగంగా మారుతున్న ప్రపంచంలో జీవిస్తున్నాము. ఈ మార్పుకు తదనుగుణంగా దేశాభివృద్ధికి సృజనాత్మకత కలిగిన యువత ఎంతో కీలకం. అందువల్ల, మన వారసత్వం మరియు విలువలను కాపాడటానికి నవల ఆలోచనలను మరియు నాణ్యమైన కార్యక్రమాలను రూపొందించడానికి మేము రెట్టింపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సాంస్కృతిక వైవిధ్యాన్ని రక్షిస్తూ శతాబ్ది వైపు వెళుతున్న మన భవిష్యత్తుకు బంగారుబాట వేయాలి." అని షేక్ ఖలీఫా ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com