కియా కార్ల కంపెనీలో ఉద్యోగావకాశాలు..
- March 16, 2021
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని పెనుగొండలోని కియా కార్ల కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. ఏదైనా విభాగంలో డిప్లొమో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. అభ్యర్థులకు 18-25 ఏళ్ల వయసు ఉండాలి.ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లిస్తారు.ఇంటర్వ్యూ వివరాలు: ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 16న ఉదయం 9 గంటలకు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్ధులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపడతారు.కాబట్టి అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ప్రిపేరై వెళితే ఫలితం ఉంటుంది. ఇతర వివరాలకు 8074370846,9848819682,7981938644 నంబర్లలో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







