ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ భద్రతపై ఆందోళన.. నేడు WHO సమీక్ష!

- March 16, 2021 , by Maagulf
ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ భద్రతపై ఆందోళన.. నేడు WHO సమీక్ష!

జెనీవా:ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ భద్రతపై WHO నిపుణుల కమిటీ బుధవారం సమీక్ష జరపనుంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్టు ఇటీవల వార్తలు రావడంతో పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై నిషేధం విధించాయి. అయితే, పలుదేశాల్లో టీకా పంపిణీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ భద్రతపై చర్చించేందుకు నిపుణుల కమిటీ మంగళవారం సమావేశం కానుంది.ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ భద్రతపై అందుబాటులో ఉన్న డేటాను WHO సలహా కమిటీ సమీక్షిస్తోందని పేర్కొన్నారు. మరోపక్క టీకా వినియోగం, సమర్ధతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌పై గురువారం 'అసాధారణ సమావేశం' నిర్వహించనున్నట్లు యూరోపియన్‌ యూనియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com