కోవిడ్ 19: ఒమన్‌లో మూడో దశ!

- March 19, 2021 , by Maagulf
కోవిడ్ 19: ఒమన్‌లో మూడో దశ!

ఒమన్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్ సెక్రెటరీ మొహమ్మద్ అల్ హోస్ని వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్‌లో కరోనా మూడో దశ కొనసాగుతోంది. ప్రస్తుతం మూడో దశ ప్రారంభంలో వున్నామనీ, ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాల్సి వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అల్ హోస్ని వెల్లడించిన వివరాల ప్రకారం 70 శాతం జనాభా ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ పొందగలుగుతారు. 30 శాతం వ్యాక్సినేషన్ జూన్ నాటికి పూర్తవుతుందని ఆయన వివరించారు. వ్యాక్సినేషన్ చాలా భద్రతతో కూడినదనీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరాల్సిన అవకాశాన్ని తగ్గిస్తుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com