విమాన ప్రయాణికులకు షాక్...
- March 20, 2021
న్యూ ఢిల్లీ:విమాన ప్రయాణికులకు షాక్ తగలనుంది.విమాన టికెట్ల ధరల కనిష్ఠ పరిమితిని 5 శాతం మేర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.విమాన ఇంధనం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి శుక్రవారం పేర్కొన్నారు.అయితే విమాన టికెట్ల ధరల గరిష్ట పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఏటీఎఫ్ ధరల పెరుగుదల కారణంగా దేశీయ విమాన టికెట్ల ధరల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితులను గత నెలలో కేంద్రం 10-30 శాతం పెంచింది.గత ఏడాది మే నెలలో దేశీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించిన సందర్భంగా విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఏడు శ్రేణులుగా వర్గీకరించి టికెట్ల ధరలపై పరిమితులు విధించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







