కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 416 మందిపై కేసు నమోదు
- March 20, 2021
దోహా:కోవిడ్ రూల్స్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్న ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు..ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లేటెస్ట్ గా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 416 మందిని అదుపులోకి తీసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు.అరెస్టైన వారిలో 395 మంది పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్కులు ధరించలేదు. గఒకే వాహనంలో పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణించినందుకు మరో ఏడుగురిపై కేసు బుక్ చేశారు.ఎతేరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోనందుకు ఆరుగురిపై, భౌతిక దూరం పాటించని 8 మందిపై కేసు బుక్ చేసినట్లు అధికారులు వివరించారు. కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తున్నా..కొందరిలో మాత్రం మార్పు రావటం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉంటామని..నిబంధనలను పాటించని వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







