అడివి శేష్ హీరోగా హిట్-2...పోస్టర్ విడుదల
- March 20, 2021
హైదరాబాద్:క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన'హిట్' చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బంపర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ మూవీతో విశ్వక్సేన్కు కూడా మంచి క్రేజ్ వచ్చింది.ఇక నటుడిగాను, నిర్మాతగాను దూసుకెళుతున్న నాని.. ఈ మూవీకి నిర్మించగా.. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.అయితే..హిట్ మూవీ మంచి విజయం సాధించిన తర్వాత దానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూశారు. అయితే.. తాజాగా దీనిపై అదిరిపోయే అప్డేట్ వచ్చింది.అవును హిట్-2 వస్తోంది. కానీ ఈ మూవీలో విశ్వక్ సేన్‌కు బదులుగా అడవి శేష్ నటిస్తున్నాడు.అంతేకాదు దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇవాళ రిలీజ్ అయింది.ఈ పోస్టర్ అడవి శేష్.. ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభకానుందని సమాచారం. హిట్ 1 తెలంగాణ నేపథ్యంలో సాగగా.. హిట్-2 ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగనుందట. అయితే.. ఈ మూవీలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించనుంది. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







