కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులకు నివాసితుల ఫిర్యాదు
- March 23, 2021
షార్జా: నివాసితులు, కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయడాన్ని పోలీసు విభాగం ప్రశంసిస్తోంది. పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ఫేస్ మాస్కులు ధరించకపోవడం, ఫ్యామిలీ పార్టీలు ఉల్లంఘనల్లో ముందు స్థానంలో వున్నట్లు చెప్పారు. నివాసితులు 901 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనీ, షార్జా పోలీస్ యాప్ ‘హారిస్’ లేదా [email protected] ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల ఆధారంగా ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో క్రైసిస్ సెల్ ఏర్పాటు చేశామనీ, కోవిడ్ 19 సంబంధిత ఫిర్యాదులను ఈ సెల్ స్వీకరించి, సమస్యల్ని పరిష్కరిస్తుందని అన్నారు. 24 గంటలూ ఈ సెల్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్









