ఇబ్బందుల్లో వున్న భారతీయుల కోసం మొబైల్ యాప్

- March 23, 2021 , by Maagulf
ఇబ్బందుల్లో వున్న భారతీయుల కోసం మొబైల్ యాప్

మస్కట్: యాండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ ‘మిగ్ కాల్’ని ఒమన్‌లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్, హెల్ప్ లైన్ నెంబర్లను స్మార్ట్ పోన్లలో సేవ్ చేస్తుంది, తద్వారా ఇండియన్ ఎంబసీతో లింక్ ఏర్పడుతుంది. భారతీయులంతా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని భారత రాయబారి సూచించారు. ఇబ్బందుల్లో వున్న భారతీయులు సదరు హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా ఎంబసీని సంప్రదించడానికి వీలుంటుంది. ఇండియన్ ఎంబసీ ఆడిటోరియంలో ఈ యాప్ ఆవిష్కరణ జరగగా, 250 మంది భారత కార్మికులు సమా 300 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. కార్మికులకు మాత్రమే కాకుండా, భారతీయులందరికీ ఈ యాప్ ఉపయోగపడుతుందని షాఫి కైపురం వెల్లడించారు. 2.8 ఎంబీ ఫైల్ సైజు గల ఈ యాప్, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ మరియు ఇంగ్లీషు భాషల్లో ఇది పనిచేస్తుంది. జిసిసి దేశాలన్నింటిలోనూ భారతీయులు ఈ యాప్ వినియోగించుకోవచ్చు. ఫారిన్ కంట్రీ పేరు, ప్రావిన్స్ వివరాలు పొందుపర్చాల్సి వుంటుంది యాప్ వినియోగదారుడు. స్వదేశం పేరుని భారతదేశంగా పేర్కొనాలి. యూఏఈని హోస్ట్ దేశంగా పేర్కొంటే, ఐదు హెల్ప్ లైన్ నెంబర్లు స్మార్ట్ ఫోన్లలోకి వస్తాయి. ఒకసారి యాప్ డౌన్ ‌లోడ్ చేసుకుంటే, ఆఫ్ లైన్ సమయంలో కూడా పనిచేస్తుందని వలసదారుల హక్కుల కార్యకర్త రెజిమోన్ కె చెప్పారు. ఒమన్‌ని హోస్ట్ కంట్రీగా పేర్కొంటే, మొబైల్ ఫోన్‌లో 5 హెల్ప్ లైన్ నెంబర్లు చేరతాయి. భారతదేశానికి సంబంధించిన మరో 5 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా యాడ్ అవుతాయి. పాస్‌పోర్టు సర్వీసులు, కౌన్సెలింగ్ సర్వీసులు, లోకల్ పోలీసు నెంబర్లు, హాస్పిటల్ నెంబర్లు ఇందులో వుంటాయి. అత్యవసర నంబర్‌కి ఎస్ఓఎస్ మెసేజ్ కూడా పంపేందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది. వినియోగదారుడి జీపీఎస్ లొకేషన్‌ని కూడా సమీపంలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి అందేలా చేస్తుంది యాప్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com