అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ కీలక నిర్ణయం
- March 23, 2021
న్యూ ఢిల్లీ:అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు తెలిపారు.కరోనా పంజా విసరడంతో.. విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.. కేవలం ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించారు.. ఆ తర్వాత విదేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి రప్పించడానికి ప్రత్యేక విమానాలు నడిపారు.. అలా దేశీయ విమానసర్వీసులకు అనుమతి ఇచ్చారు.. కానీ, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి షెడ్యూల్డు అంతర్జాతీ విమాన సర్వీసులు మాత్రం నిలిపివేసింది కేంద్రం.. మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానల నిలిపివేతను పొడిగిస్తున్నట్టు DGCA వెల్లడించింది.. అయితే, అవసరాలకు అనుగుణంగా.. ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కానీ, ఇంటర్నేషనల్ ఆల్ కార్గో ఆపరేషన్స్, విమానాలకు ఈ ఆంక్షలు వర్తించబోవని DGCA స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







