ఏపీలో కరోనా కేసుల వివరాలు

- March 24, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,066 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 585 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు.  అదే సమయంలో 251 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 895121కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 884978 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7197 మంది మృతిచెందారు.ప్రస్తుతం రాష్ట్రంలో 2946 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌ లో పేర్కొంది సర్కార్. ఇక ఈరోజు కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ ప్లాన్‌పై వైద్యారోగ్యశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వచించారు. నాలుగు, ఐదు వారాల్లో కోటి మందికి కోవిడ్‌ వ్యాక్సినేషనుకు సన్నాహాలు చేయాలని ఎన్నికలు పూర్తయినందున సోమవారం నుంచి అర్భన్‌ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌కు ప్రణాళికలు సిద్దం చేయాలనీ సూచించారు.రూరల్‌ ఏరియాలో పైలట్‌ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్‌ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంచేయండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు.వీలైనంత త్వరగా విలేజ్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకు రావాలని అన్నారు. వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయి యాక్టివిటీగా గ్రామాల్లో చేపట్టాలని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com