ఇక ఉద్యోగుల కుటుంబాలకు బీమా ధీమా
- March 25, 2021
సౌదీ:కంపెనీలు, సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలకు కూడా తప్పనిసరిగా బీమా కల్పించాలని సౌదీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ కోఆపరేటివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల కుటుంబంలో బీమాకు అర్హులైన అందరికీ కంపెనీలు, సంస్థలు ఉచితంగా ఇన్సూరెన్స్ అందించాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో కొందరికీ మాత్రమే బీమాను పరిమితం చేయటం సరికాదని అభిప్రాయపడింది. ఉద్యోగి భార్య, కొడుకులు(25 ఏళ్లలోపు ఉన్నవారికి మాత్రమే), పెళ్లికాని, ఉద్యోగం లేని కూతుళ్లకు తప్పనిసరిగా బీమా సౌకర్యం కల్పించాలని స్పష్టం చేసింది. ఉద్యోగి, కార్మికుడు విధుల్లో చేరిన తొలి రోజు నుంచే అతని కుటుంబానికి బీమా కల్పించాల్సిన బాధ్యత ఆయా కంపెనీలు, సంస్థలదేనని వెల్లడించింది. ఒకవేళ ఉద్యోగి వేరే కంపెనీలో చేరితే కొత్త కంపెనీ యాజమాన్యం బీమా బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!