86 బహ్రెయినీ కుటుంబాలకు మునిసిపల్ రుసుము తగ్గింపు
- March 25, 2021
బహ్రెయిన్:వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇస్సామ్ బిన్ అబ్దుల్లాహ్ ఖలాఫ్, 86 బహ్రెయినీ కుటుంబాలకు మునిసిపాలిటీ ఫీజు తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ఇళ్ళల్లో వుంటోన్న కుటుంబాలకు ఫిబ్రవరి నెల కోసం ఈ తగ్గింపు వర్తింపజేయనున్నారు. క్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. కింగ్ హమాద్ బిన్ ిసా అల్ ఖలీఫా, పౌరుల గౌరవప్రదమైన జీవనం నిమిత్తం కీలక ఆదేశాలు జారీ చేశారని మినిస్టర్ పేర్కొన్నారు. మునిసిపాలిటీస్ ఎఫైర్స్ డిపార్టుమెంట్ అలాగే కస్టమర్ సర్వీస్ డైరెక్టరేట్ - ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ సహకారంతో మునిసిపల్ ఫీజు సంబంధిత కుటుంబాలకు తగ్గించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త









