కర్నూలు ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన సీఎం జగన్

- March 25, 2021 , by Maagulf
కర్నూలు ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ:కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో నూతనంగా నిర్మించిన కర్నూలు ఎయిర్ పోర్ట్ ను గురువారం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ కూడా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండిగో సంస్థ మార్చి 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు మౌలిక వసతులను కల్పించారు.

ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నామని సీఎం జగన్ ప్రకటించారు. గాంధీ, వల్లభా భాయ్ పటేల్ ల కంటే ముందుగానే బ్రిటీష్ వారికి ఎదురు తిరిగి, ప్రజల తరపున పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడితేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com