కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ధర తగ్గింపు

- March 25, 2021 , by Maagulf
కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ధర తగ్గింపు

యూఏఈ:కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ధరను 65 దిర్హాములకు తగ్గించినట్లు అబుదాబీ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.ప్రస్తుతం నాసల్ స్వాబ్ టెస్ట్ కోసం 85 దిర్హాములు వెచ్చించాల్సి వస్తోంది. శాంపిల్ కలెక్షన్, టెస్టింగ్ కోసం ఈ 65 దిర్హాముల ధరను నిర్ణయించారు.వ్యాక్సినేషన్ చేయించుకోని ఉద్యోగులకు (హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్‌పోర్టేషన్, అలాగే వైద్య రంగాల్లో పనిచేస్తున్నవారు) ప్రతి 14 రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయాల్సి వుంటుంది. లాండ్రీలు, బ్యూటీ సెలూన్లు వంటి వాటిల్లో పనిచేసేవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు వారానికి ఓ సారి టెస్ట్ చేయించుకోవాలి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడంతో కరోనా కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. మరింత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి, దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com