వ్యాక్సిన్ రవాణాలో నూతన టెక్నాలజీ ఉపయోగించుకోనున్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్

- March 25, 2021 , by Maagulf
వ్యాక్సిన్ రవాణాలో నూతన టెక్నాలజీ ఉపయోగించుకోనున్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్
  • GHAC ద్వారా హ్యాండిల్ చేసే వ్యాక్సిన్లకు సంబంధించిన రియల్ టైమ్ ట్రాకింగ్ మరియు పర్యవేక్షణకు సహాయపడే సాంకేతిక పరిష్కారం ఆవిష్కరణ.
  • ‘వ్యాక్సిన్‌లెడ్జర్’ ప్లాట్‌ఫామ్‌లో చేరిన వ్యాక్సిన్ల తయారీదారులు మరియు బయ్యర్లకు వ్యాక్సిన్లు ప్రస్తుతం ఎక్కడున్నాయి, వాటి నాణ్యత మరియు భద్రతను తెలుసుకోగలిగే అవకాశం 

హైదరాబాద్: జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (GACAEL) యొక్క విభాగం జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) నేడు GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క కార్గో టెర్మినల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, వ్యాక్సిన్ల ట్రాకింగ్ మరియు పర్యవేక్షణ కోసం హైదరాబాద్‌లోని టెక్నాలజీ స్టార్ట్-అప్ స్టాట్‌విగ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒప్పందంపై నేడు శ్రీ సౌరభ్ కుమార్, సీఈఓ, జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో; మరియు శ్రీ సిడ్ చక్రవర్తి,  నృపుల్ పొనుగోటి, కో ఫౌండర్స్ – స్టాట్‌విగ్, సంతకాలు చేసారు.

భారతదేశ ఎయిర్ కార్గోలో ప్రధానమైన ఫార్మా హబ్‌గా ఉంటూ, దేశం నుండి వ్యాక్సిన్ ఎగుమతులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ ఎయిర్ కార్గో,  ఈ భాగస్వామ్యం ద్వారా ఆధునిక బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సహాయంతో కార్గో టెర్మినల్ వద్ద వ్యాక్సిన్లను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తుంది.   

GMR కార్గో సామర్థ్యాలు, వ్యాక్సిన్ ఎగుమతిదారులతో దాని సంబంధాలు మరియు స్టాట్‌విగ్ యొక్క బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌ - ఆ రెండూ కలిసి భారతదేశం నుండి ఎయిర్ కార్గో ద్వారా వ్యాక్సిన్ ఎగుమతుల సప్లై చెయిన్‌ను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. 

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టీకా తయారీదారులలో ఒకటైన హైదరాబాద్, కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సహాయపడటానికి రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతం నుంచి 3.5 బిలియన్ మోతాదుల COVID-19 వ్యాక్సిన్ ఉత్పత్తి చేయటానికి సిద్ధంగా ఉంది.   

సౌరభ్ కుమార్, సీఈఓ-హైదరాబాద్ ఎయిర్ కార్గో, “భారతదేశంలో ఎయిర్ కార్గో పరిశ్రమలో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్‌లెడ్జర్ ప్రారంభిస్తూ,  ఈ భాగస్వామ్యాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ క్రొత్త సాంకేతిక ఉత్పత్తి వ్యాక్సిన్ రవాణాలో మా వినియోగదారులకు రియల్-టైమ్ సమాచారాన్ని అందించడానికి సహాయపడుతుంది. వ్యాక్సిన్ నిర్వహణలో GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో సామర్థ్యం, స్టాట్‌విగ్ యొక్క బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత వ్యాక్సిన్‌లెడ్జర్ ప్లాట్‌ఫాం – ఈ రెండూ కలిసి కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో వ్యాక్సిన్ సప్లై చెయిన్‌ను బలోపేతం చేస్తాయని విశ్వసిస్తున్నాము.” అన్నారు.  

శ్రీ ప్రదీప్ పణికర్, సీఈఓ-జీహెచ్‌ఐఎఎల్, ‘‘స్టాట్‌విగ్ తో ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో వ్యాక్సిన్లను హ్యాండిల్ చేయడంలోని అత్యున్నతమైన గేట్ వేలలో ఒకటిగా తన స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకోనుంది.హైదరాబాద్ ఎయిర్ కార్గో మౌలిక సదుపాయాల రూపేణా, సాంకేతిక పరిజ్ఞానం రూపేణా తన సామర్థ్యాలను పెంచుకుంటూ, కోవిడ్ పై పోరాటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది’’ అన్నారు.

శ్రీ ఎస్.జి.కె కిషోర్, ఈడీ-సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్- జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, మాట్లాడుతూ, ‘‘కోవిడ్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో టెక్నాలజీ మరియు ఉష్ణోగ్రత నియంత్రిత సప్లై చెయిన్ కీలకమైనవి. కస్టమర్లకు, విమానాశ్రయ మౌలిక సదుపాయాల వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి GMR ఎల్లప్పుడూ ముందుంటుంది. సాంకేతిక నాయకత్వం మరియు కస్టమర్-కేంద్రీకృత దృష్టి రీత్యా ఈ ‘వ్యాక్సిన్‌లెడ్జర్’ భాగస్వామ్యం చాలా ముఖ్యం. ప్రతి వ్యాక్సిన్‌ లెక్కలోకి వచ్చే ఈ కీలకమైన సమయాల్లో, ఈ వ్యాక్సిన్‌లెడ్జర్ వ్యాక్సిన్ల సురక్షిత రవాణాకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము” అన్నారు.

GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో భారతదేశంలో WHO-GSDP (ప్రపంచ ఆరోగ్య సంస్థ- మెరుగైన నిల్వ, పంపిణీ పద్ధతులు) ద్వారా ధృవీకరించబడిన ప్రధాన విమానాశ్రయం. టెంపరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆటంకాలు లేని పంపిణీ కోసం ఇది సంసిద్ధంగా ఉంటుంది. పెరిషబుల్స్, వ్యవసాయ ఉత్పత్తులు మరియు టెంపరేచర్ సెన్సిటివ్ ఔషధాల ప్రత్యేకమైన అవసరాలను తీర్చడానికి GHAC ల్యాండ్‌సైడ్ మరియు ఎయిర్‌సైడ్‌లో తన సౌకర్యాలను విస్తరిస్తూ, ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తోంది. GHAC ఎయిర్ సైడ్ రవాణా కోసం ఎయిర్ క్రాఫ్ట్ కోల్డ్-చైన్ నిర్వహణ కోసం ఒక మొబైల్ రిఫ్రిజిరేటెడ్ యూనిట్ కూల్ డాలీని ప్రారంభించింది. ఇక్కడి నుంచి ప్రధానంగా పెరిషబుల్స్ (వ్యవసాయ మరియు సముద్ర ఉత్పత్తులు), ఔషధాలు, ఇంజనీరింగ్ & ఏరోస్పేస్, వస్త్రాలు మరియు ఎలక్ట్రానిక్స్‌ల ఎగుమతి, దిగుమతులు జరుగుతాయి. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com