హాక్ అల్ లైలా సెలబ్రేషన్స్: గైడ్‌లైన్స్ జారీ చేసిన యూఏఈ
- March 26, 2021
యూఏఈ:నేషనల్ ఎమర్జన్సీ మరియు క్రైసిస్ మేనేజ్‌మెంట్ అథారిటీ, కమ్యూనిటీ మెంబర్స్‌కి విజ్ఞప్తి చేసింది. హాక్ అల్ లైలా-మిడిల్ ఆఫ్ షాబా సెలబ్రేషన్స్ నిమిత్తం ఈ విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజా భద్రత అనేది అతి ముఖ్యమైన అంశమనీ, ఈవెంట్ సందర్బంగా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కోరింది.పవిత్ర రమదాన్ మాసానికి రెండు వారాల ముందు ఈ వేడుక వస్తుంది. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ వేడుక పరిమితం చేయాలనీ, స్వీట్ల పంపిణీ, బహుమతుల పంపిణీకి దూరంగా వుండాలనీ అథారిటీస్ విజ్ఞప్తి చేశాయి. ఫేస్ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ వుండేలా చూసుకోవడం తప్పనిసరి. కరోనా నిబంధనల్ని పాటించడం నేషనల్ డ్యూటీగా భావించాలని పౌరులు, నివాసితులకు కమిటీ సూచించింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







