రయ్యా హైవే పునరుద్ధరణ ఫేజ్ 1 పనులు మొదలు

- March 26, 2021 , by Maagulf
రయ్యా హైవే పునరుద్ధరణ ఫేజ్ 1 పనులు మొదలు

బహ్రెయిన్:12 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో చేపడుతున్న రయ్యా హైవే పునరుద్ధరణ పనులకు సంబంధించి తొలి దశ త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇస్సామ్ ఖలాఫ్ వెల్లడించారు.మొత్తం 17 బిడ్లు టెండర్ ప్రాసెస్‌లో వచ్చాయి.ఏప్రిల్ 2021లో మొదలై ఎనిమిది నెలల్లో అంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. మూడు ఫేజుల్లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తారు.ఈ రోడ్డు పునరుద్ధరణతో ట్రాఫిక్ సమస్యలు తీరడంతోపాటు, కనెక్టివిటీ బాగా పెరుగుతుంది.భూ సేకరణ ఆరు కిలోమీటర్ల మేర పూర్తయ్యిందనీ దీనికోసం 3.16 మిలియన్ దినార్లను పరిహారంగా చెల్లించామనీ మినిస్ట్రీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com