నేటి నుంచి తిరుమలలో కొత్త నిబంధనలు...

- March 29, 2021 , by Maagulf
నేటి నుంచి తిరుమలలో కొత్త నిబంధనలు...

తిరుమల:ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.మొన్నటి వరకు తగ్గిన కేసులు..గత పదిరోజులుగా భారీగా పెరుగుతున్నాయి.అటు ఏపీలోని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.అయితే.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కొత్త నిబంధలని తీసుకువచ్చింది.కొత్త నిబంధనల ప్రకారం దర్శన సమయానికి 24 గంటల ముందే నడకదారి భక్తులను అనుమతించనున్నారు అధికారులు.అలాగే 1 గంట తరువాతే..రేపటి రోజు దర్శన టికెట్లు ఉన్న భక్తులను ఘాట్‌ రోడ్డులో అనుమతించనున్నారు.అయితే..ఈ సమాచారం తెలియక అలిపిరి వద్ద భారీగా భక్తులు గుమికూడుతున్నారు.అటు భక్తులను అదుపు చేయలేక చేతులు ఎత్తేస్తోంది విజిలేన్స్ సిబ్బంది.ఇక తిరుమల...టిటిడి తీసుకువస్తున్న కొత్త నిబంధనలతో శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com