దుబాయ్ లో షూటింగ్ జరుపుకోనున్న 'ఖిలాడి'
- March 29, 2021
దుబాయ్:'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న రవితేజ చిత్రం 'ఖిలాడి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిజానికి ఇటలీలో మరో పాటను చిత్రీకరించాలనుకున్నా లాక్ డౌన్ కారణంగా యూనిట్ ఇండియా వచ్చేసింది. ఐదవ తేదీ నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టి మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 10 నుంచి దుబాయ్ వెళ్ళి అక్కడ పాటతో పాటు మరి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇందులో మాస్ మహారాజా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఇక ఇప్పటికే విడుదలైన 'ఖిలాడి' ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇక రీమేక్స్ చేయటంలో స్పెషలిస్ట్ అయిన రమేశ్ వర్మ ఇప్పటికే కొరియన్ చిత్రాన్ని 'రైడ్' పేరుతో... తమిళ 'రాక్షసన్' చిత్రాన్ని బెల్లంకొండ సాయితో 'రాక్షసుడు'గా తీసి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న 'ఖిలాడి' కూడా ఓ తమిళ సినిమాకు రీమేక్ కావటంతో ఈ సినిమా పూర్తి స్థాయిలో బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మే 28న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









