లిక్విడ్స్ అలాగే డివైజెస్ కోసం కొత్త ఎయిర్ పోర్టు స్కానర్లు

- March 30, 2021 , by Maagulf
లిక్విడ్స్ అలాగే డివైజెస్ కోసం కొత్త ఎయిర్ పోర్టు స్కానర్లు

కువైట్:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. బ్యాగుల్లో లిక్విడ్స్ అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్ నిమిత్తం ఈ స్కానర్లను ఏర్పాటు చేస్తున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద ఈ స్కానర్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్క్షానంతో వీటిని తయారు చేశారు. 70 హై స్కాన్ 6040 సిటిక్స్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ సిటి ఎక్స రే పరికరాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఏడాదికి 25 మిలియన్ల ప్రయాణీకుల్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం ఈ విమానాశ్రయానికి వుంది. టెస్టింగ్ విధానాల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, ఆలస్యం వంటివాటిని నివారించేందుకు అధునాతన పరికరాల ఏర్పాటు తప్పనిసరైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com