అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ప్రారంభం
- April 01, 2021
కరోనా కారణంగా 2020లో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. ఈ ఏడాది యాత్రను ప్రారంభించేందుకు దేవస్థానం బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం(01 ఏప్రిల్ 2021) నుంచి యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. కరోనా కారణంగా నిబంధనలు అమలు చేస్తున్నారు దేవస్థానం వారు. 13 ఏళ్ల లోపు పిల్లలు 75 ఏళ్ళు పైబడిన వృద్ధులను అనుమతించబోమని తెలిపింది.
రెండేళ్ల తర్వాత యాత్ర జరుగుతుండటంతో ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావిస్తున్నారు అమర్ నాథ్ దేవస్థానం బోర్డు అధికారులు. ఆరు లక్షల మంది వరకు మంచు శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో దక్షిణ కాశ్మీర్‌లో ఉన్న మంచులింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏడు లక్షలమంది వెళ్తుంటారు.
రిజిస్ట్రేషన్ వివరాలు
దేశవ్యాప్తంగా 446 పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూకాశ్మీర్ బ్యాంక్, యస్ బ్యాంక్ శాఖల్లో యాత్ర రిజిస్ట్రేషన్‌కు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ బ్యాంకు శాఖల వివరాలు www.shriamarnathjishrine.com అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేశారు. ఈ యాత్ర 56 రోజులపాటు సాగుతుంది. ఈ సారి బాల్తాల్, చందన్వారీ ప్రారంభం అవుతుంది. ఈ వివరాలను బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితీశ్వర్ కుమార్ తెలిపారు.
తెలంగాణలో ఆరు బ్యాంకులలో రిజిస్ట్రేషన్
అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణలో ఆరు బ్యాంకులు, ఏపీలో ఆరు బ్యాంకులలో ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో కరీంనగర్, సంగారెడ్డి, సిద్ధిపేట, సికింద్రాబాద్ లో హిమాయత్ సాగర్ లో గత పీఎన్‌బీ బ్యాంకులతోపాటు జమ్మూకాశ్మీర్ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు చిత్తూరు, కడప, నెల్లూరు, విశాఖపట్నంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు. గురువారం నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు అమర్ నాథ్ దేవాలయం అధికారులు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







