నవిన్ పోలిశెట్టి తో మూవీ నిర్మించనున్న మహేష్ బాబు
- April 01, 2021
నవిన్ పోలిశెట్టి తో మూవీ నిర్మించనున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాత మరో క్రేజ్ ప్రాజెక్ట్ రానుంది. ఇప్పటికే ఆయన అడవి శేషు హీరోగా ‘మేజర్’ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన యువ హీరో నవిన్ పోలిశెట్టి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీని నిర్మించనున్నట్లు తాజా సమాచారం. పూర్తి ఎంటర్టైన్‌మెంట్‌తో ప్లాన్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరుగినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
ఇక పూర్తి తారాగాణాన్ని నిర్ణయించాకే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. కాగా ఆయన నటించిన శ్రీమంతుడుతోనే మహేశ్ నిర్మాతగా మారారు. అయితే ఇందులో స్లీపింగ్ పార్టనర్‌గా ఉన్న ఆయన ‘మేజర్’తో నిర్మాతగా పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ మూవీని సోనీ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు. ఆయన స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీని జూలై 2వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







