వలసదారులకు సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపుల నిలిపివేత

- April 01, 2021 , by Maagulf
వలసదారులకు సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపుల నిలిపివేత

కువైట్ సిటీ: సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపులు వలసదారులకు అందాలంటే, రెసిడెన్సీ రద్దు చేసుకుని, దేశం విడిచి వెళుతున్నట్లుగా నిర్ధారణ పత్రాలు చూపించాల్సి వుంటుంది. ఈ మేరకు సంబంధిత అథారిటీస్ స్పష్టతనిచ్చాయి. నాన్ కువైటీ ఉద్యోగి, తన విధుల నుంచి తప్పుకుని, వేరే చోట విధుల్లో చేరితే, అలాంటివారికి సేవల ముగింపు తర్వాత వచ్చే చెల్లింపులు ఆపివేయబడతాయి. శాశ్వతంగా దేశం విడిచి వెళ్ళే వరకు ఆ నిధులు రిజర్వ్ చేయబడతాయి. కువైటైజేషన్ విషయమై కొన్ని వెసులుబాట్లు కోరుతూ వస్తున్న అభ్యర్థనల్ని సి.ఎస్.సి. తోసిపుచ్చింది. మెడికల్ స్పెషాలిటీస్, కొన్ని టీచింగ్ స్పెషాలిటీస్ తప్ప మిగతా చోట్ల వలసదారుల అవసరంలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com