కోవిడ్ పిసిఆర్ టెస్ట్ - పరస్పర సహకారరం అభినందనీయం
- April 01, 2021
అబుధాబి: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో అబుధాబి రెసిడెంట్స్, కరోనా పిసిఆర్ టెస్టులు చేయించుకునే క్రమంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. అబుదాబీలో మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ కరోనా టెస్టులు చేయిస్తున్నారు. జూన్ 2020న ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకుంటున్నారు అబుధాబి రెసిడెంట్స్. కీలకమైన విభాగాల్లో పనిచేసేవారు వారానికి ఓ సారి కరోనా టెస్ట్ చేసుకోవాల్సి వుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా పిసిఆర్ టెస్టుల నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియగా మారింది. కరోనా టెస్టులు ఎక్కడ నిర్వహిస్తున్నారనే అంశాలతోపాటు, కరోనా జాగ్రత్తల గురించి కూడా సోషల్ మీడియాలో విలువైన సమాచారం దొరుకుతోందని అబుధాబి రెసిడెంట్స్ చెబుతున్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







