మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా

- April 02, 2021 , by Maagulf
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా

ముంబై:మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 43,183 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 249 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,56,163 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 54,898 కి చేరింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 32,641 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 24,33,368 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 3,66,533 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కాగా మహారాష్ట్ర పూణే జిల్లాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ జిల్లాలో 8,011 కేసులు నమోదు కాగా.. 65 మంది మరణించారు. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కరోనా నిబంధనలు పాటించకపోతే.. కఠినమైన లాక్డౌన్‌ను అమలు చేయక తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com