ఏప్రిల్ 22 వరకు కర్ఫ్యూ పొడగింపు
- April 02, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాధి నియంత్రణకు కర్ఫ్యూను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. మరో రెండు వారాల పాటు అంటే ఏప్రిల్ 22 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే రోజు వారి పాక్షిక కర్ఫ్యూ సమయాన్ని పది గంటలకు కుదించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పవిత్ర రమదాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని డెలివరీ సర్వీసులకు సడలింపు ఇచ్చారు. రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు రెస్టారెంట్లు, కేఫ్లు, కేటరింగ్ సర్వీసులు ఆన్లైన్ డెలివరీ కొనసాగించవచ్చు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు అవుట్డోర్ ఎక్సర్సైజ్కి అనుమతి ఉంటుంది. పండగ దృష్ట్యా రాత్రి 7 నుంచి మధ్య రాత్రి వరకు షాపింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఫ్రీ బుకింగ్ తర్వాతనే షాపింగ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







