ఆస్పత్రిలో జాయిన్ అయిన సచిన్
- April 02, 2021
ముంబై:భారత మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. ఇదే విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రోడ్ సేఫ్టీ ట్రోఫీ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలు, ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లు సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన, తన క్షేమం కోరిన వారందరికీ సచిన్ ధన్యవాదాలు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అందరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని ప్రజలకు సచిన్ టెండూల్కర్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా టీమిండియాకు, భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, మార్చి 27వ తేదీన ఆరోగ్యంలో స్వల్ప తేడాలు కనిపించడంతో సచిన్ టెండూల్కర్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్ట్‌లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో.. సచిన్ హోమ్ ఐసోలేషన్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు సచిన్.. ఆస్పత్రిలో చేరారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







