శ్రీవారి భక్తులకు శుభవార్త...
- April 03, 2021
తిరుమల:తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. గదుల కోసం ఇకపై కళ్లుకాయలు కాచేలా చూసే అవసరం భక్తులకు లేదు. ఈ విషయాన్ని ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.ఆన్లైన్లో గదులు ముందుగా బుకింగ్ చేసుకున్న భక్తులు ప్రస్తుతం తిరుమలలోని సీఆర్వో ఆఫీసుకు వెళ్లి అక్కడి నుంచి సబ్‌ఎంక్వైరీ కార్యాలయానికి చేరుకుని గదులు పొందుతున్నారు.ఈ ప్రక్రియ కోసం భక్తులు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది . అందుకే ఈ పద్దతిలో మార్పులు చేయాలని నిర్ణయించామన్నారు.
తిరుమలకు వచ్చే భక్తులు టికెట్లు అలిపిరి చెక్ పాయింట్ వద్ద స్కాన్ చేసిన వెంటనే మెసేజ్ ద్వారా మొబైల్ నంబర్లకు సబ్ ఎంక్వైరీ ఆఫీసు వివరాలు తెలియజేస్తామన్నారు. భక్తులు నేరుగా ఆ కార్యాలయానికి వెళ్లి గదులు పొందవచ్చని చెప్పారు. మరో పది రోజుల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈవో. ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు తీసుకునే భక్తులు అదే స్క్రీన్‌పై గదులను బుక్ చేసుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో మార్పులు తీసుకువస్తామని తెలిపారు.
తిరుమల వెంకన్న సన్నిధిలో ఈనెల 13న శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈవో. ఈ నెల 24 నుంచి 26 వరకు తిరుమల వసంత మండపంలో స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!







