'ఒరేయ్ బామ్మర్ది' ఫస్ట్ లుక్ విడుదల
- April 04, 2021
చెన్నై:‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు హీరో సిద్ధార్థ్. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న సిద్ధార్థ్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈ ఒక్క సినిమాతో లేడీ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడీ హీరో. అనంతరం ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘బావ’ వంటి వరుస సినిమాలతో తెలుగు హీరోగా మారాడీ తమిళ స్టార్.
ఇక ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో తెలుగులో పెద్దగా కనిపించడం లేదు సిద్ధార్థ్. పూర్తిగా తమిళ సినిమాలకే పరిమితం అయ్యాడు. కనీసం డబ్బింగ్ రూపంలో కూడా సిద్ధార్థ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు సిద్ధార్థ్. ఇందుకోసం ‘బిచ్చగాడు’ సినిమా దర్శకుడు శశితో చేతులు కలుపుతున్నాడు. సిద్ధార్థ్, జీవీ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్‌లు నటిస్తున్నారు. ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తమిళంలో ‘శివప్పు మంజల్ పచాయ్’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెరకెక్కుతోంది. ఇక చిత్రంలో సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్‌లు ఒకరికి మించి ఒకరు పోటీ చేస్తారని తెలుస్తోంది. వీరి కాంబినేషనల్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







