కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన BCCI...
- April 04, 2021
ముంబై:కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ఐపిఎల్ నిర్వహణపై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వాంఖడే స్టేడియంలో నిర్వహించతలపెట్టిన మ్యాచ్‌లన్నీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోపక్క ఒక్కొక్కరుగా ఐపిఎల్ క్రీడాకారులు కరోనా బారిన పడుతున్నారు.ముంబై, చెన్నై, ఆర్‌సిబి, ఢిల్లీ జట్లలో కొందరు ఆటగాళ్లు, సిబ్బంది కరోనాకు గురయ్యారు.దీంతో ఆందోళన నెలకొంది.ఈ క్రమంలోనే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తాజాగా బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టోర్నమెంట్ నిమిత్తం కేవలం ఆరు వేదికలనే ఎంపిక చేశామని, బయో బబుల్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపారు. ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆటగాళ్లకు వ్యాక్సినేషన్‌పై కేంద్రంతో చర్చిస్తామని చెప్పారు. వ్యాక్సినేషన్ వారికి అవసరమని తెలిపారు. ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నమెంట్ నిర్వహణపై ఆలోచిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







