మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

- April 04, 2021 , by Maagulf
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ముంబై:రాష్ట్రంలో కోవిడ్ -19 యొక్క భయంకరమైన వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కఠినమైన కొత్త ఆంక్షలను ప్రకటించింది.ప్రతి శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు వారాంతపు లాక్ డౌన్ అలానే ప్రతి రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు.గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు బాగా పెరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు వచ్చింది. శనివారం రాష్ట్రంలో 49,447 తాజా కేసులు, 277 మరణాలు నమోదయ్యాయి.COVID-19 కేసుల పెరుగుదలను పరిమితం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదివారం రాష్ట్రానికి చెందిన బిజినెస్ మ్యాన్ బృందాన్ని కలిశారు. సీఎం మరియు పారిశ్రామికవేత్తల మధ్య మధ్యాహ్నం జరిగిన వర్చువల్ సమావేశానికి పరిశ్రమ లాబీ సిఐఐ జాతీయ అధ్యక్షుడు, బ్యాంకర్ ఉదయ్ కోటక్ నాయకత్వం వహించినట్లు అధికారులు తెలిపారు.మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్ విధించినట్లయితే ప్రజలకు కష్టాలు ఎదురవుతాయని పరిశ్రమల నాయకులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com