హాస్పిటల్‌లో అక్షయ్ కుమార్
- April 05, 2021
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కొవిడ్‌తో హాస్పిటల్‌లో చేరాడు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు చెప్పిన అతడు.. డాక్టర్ల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం మరో ట్వీట్ చేశాడు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ ప్రార్థనలు పని చేస్తున్నాయి. నేను బాగానే ఉన్నాను. అయితే ముందు జాగ్రత్తగా డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అని అక్షయ్ ట్వీట్ చేశాడు.
మరోవైపు అక్షయ్ నటిస్తున్న రామ్‌సేతు మూవీలో ఏకంగా 45 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆమిర్ ఖాన్, ఆలియా భట్, ఫాతిమా సనా షేక్, కార్తీక్ ఆర్యన్, పరేష్ రావల్, మిలింద్ సోమన్‌లాంటి వాళ్లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ కరోనా మరింత ఉద్ధృతంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లోనే కేసులు లక్ష దాటాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







