త్వరలోనే తెలంగాణ ఎమ్మెల్యేలకు నోటీసులు..
- April 05, 2021
బెంగళూరు:బెంగళూరులో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో హైదరాబాద్ లింక్‌లు సంచలనం రేపుతున్నాయి...బెంగళూరులో కొద్దిరోజుల క్రితం పట్టుబడిన నైజీరియన్స్ ను విచారిస్తున్న సమయంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత శంకర్ గౌడ్‌తో కలిసి కలహర్ రెడ్డి, సందీప్.. డ్రగ్స్ దందా సాగించినట్లు సమాచారం.బెంగళూరులో ఉన్న పబ్‌లు,హోటళ్లకు హైదరాబాద్‌కు చెందిన సందీప్, కలహర్ రెడ్డి అనే వ్యాపారవేత్తలు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా గుర్తించారు.. ఇక, ఈ కేసులో ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రచారంలో ఉండగా.. ఎమ్మెల్యేల ఆర్డర్ మేరకు కొకైన్‌ను చాలా సార్లు పంపినట్టు కూడా పోలీసుల విచారణలో సందీప్ బయటపెట్టినట్టుగా చెబుతున్నారు. అంతే కాదు.. తెలంగాణలో చాలా మంది ప్రముఖులకు కూడా ఈ గ్యాంగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు, చేస్తున్నట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది.కలహార్ రెడ్డి, శంకర్ గౌడ్‌తో పాటు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలను కూడా విచారిస్తారని తెలుస్తోంది.బెంగళూరు పోలీసులు త్వరలోనే సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.. ఇక, ఈ కేసులో ఇవాళ కలహార్‌రెడ్డి,రతన్‌రెడ్డి పోలీసులు ప్రశ్నించనున్నారు.మొత్తంగా.. ఈ కేసులో ఎమ్మెల్యేల లింక్‌లు సంచలనంగా మారాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







