‘వకీల్ సాబ్’ సెన్సార్ పూర్తి
- April 05, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ ‘పింక్’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు నిర్మించారు. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. ఇందులో పవన్ న్యాయవాదిగా కనిపించనున్నారు. కాగా, తాజాగా 'వకీల్‌సాబ్' సెన్సార్ పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.సెన్సార్ టాక్ అయితే వకీల్ సాబ్‌కు చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ‘పింక్’ సినిమాలో దాదాపుగా ఫైట్స్ ఉండవు కానీ ‘వకీల్ సాబ్’లో మొత్తం 5 యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నట్లు సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి వకీల్ సాబ్ లో జరిగిన మార్పులు తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే!
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







