సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

- April 06, 2021 , by Maagulf
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

న్యూ ఢిల్లీ:సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణను నియమిస్తూ రాష్ట్రప్రతి రాంనాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ పదవిలో 2021 ఏప్రిల్‌ 24 నుంచి 2022 ఆగస్టు 26 వరకు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎస్‌.ఏ బాబ్డే పదవీ కాలం మరో నెల రో జుల్లో ముగియనుంది. ఏప్రిల్‌ 23న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినియారిటీ ప్రకారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ (నూతలపాటి వెంకటరమణ)ను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జస్టిస్‌ బాబ్డే సిఫారసు చేశారు. ఈ సిఫారసును ప్రభుత్వం ఆమోదించిన తరువాత.. జస్టిస్ రమణ సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2021 ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగస్టు 26న పదవీ విరమణ చేసేంత వరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. జస్టిస్ రమణ పూర్తిపేరు నూతలపాటి వెంకట రమణ.

ఆయన 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం కావడం విశేషం. జస్టిస్‌ రమణ 1983 ఫిబ్రవరి 10న బార్‌ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్నారు. 2000 జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నతస్థాయికి ఎదిగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com