శంషాబాద్ విమానాశ్రయంలో అద్దెకు ఖరీదైన కార్లు..!
- April 06, 2021
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఖరీదైన అద్దెకు కార్లు సందడి చేస్తున్నాయి. దేశంలోనే తొలిసారి ఫెరారీ కంపెనీ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా చాలా తక్కువ మంది చేతిలో ఉండే ఈ తరహా ఖరీదైన కార్లకు...10 కిలో మీటర్ల ప్రయాణానికి 22వేల రూపాయల అద్దె వసూలు చేస్తున్నారు. ఒక్కో కారు ధర సుమారు ఐదు కోట్ల వరకు ఉంటుంది. ఈ కార్లను ఎయిర్‌పోర్ట్‌లో... అరైవల్ పాయింట్ వద్ద హెల్ప్ డెస్క్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కారు బుకింగ్‌కు 1499 నుంచి 5వేల రూపాయల వసూలు చేస్తారు. బీఎండబ్ల్యూ 7 సిరీస్ కార్లలో సెల్ఫ్ డ్రైవింగ్‌కు ముందుగా లక్ష డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కారు అద్దె గంటకు 5వేల రూపాయలు కాగా, గంట దాటితే కిలో మీటర్‌కు అదనంగా 177 రూపాయలు వసూలు చేస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో ఫెరారీ, రేంజ్ రోవర్, బెంట్లీ, కాంటినెంటల్, మెర్సిడేజ్ బెంజ్, ఫోర్ ముస్తాక్, ఆడి, వోల్వో, టొయోటో, బీఎండబ్ల్యూ సహా 30కి పైగా మోడళ్ల కార్లు అద్దెకు అందుబాటులో ఉన్నాయి.
--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







