యూఏఈలో త్వ‌ర‌లోనే ఎల‌క్ట్రానిక్ నోట‌రీ విధానం

- April 06, 2021 , by Maagulf
యూఏఈలో త్వ‌ర‌లోనే ఎల‌క్ట్రానిక్ నోట‌రీ విధానం

యూఏఈ:న‌కిలీ నోట‌రీల‌తో మోసాల‌కు పాల్ప‌డ‌కుండా త్వ‌ర‌లోనే ఎల‌క్ట్రానిక్ నోట‌రీ విధానాన్ని అమ‌లులోకి తీసుకురానున్న‌ట్లు యూఏఈ న్యాయ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అన్ని నోట‌రీల‌పై త‌ప్ప‌నిస‌రిగా బార్ కోడ్ ఉంటుంద‌ని.. ఆ బార్ కోడ్ ద్వారా న‌కిలీ నోట‌రీల‌ను, న‌కిలీ ఏజెన్సీల‌ను వెంట‌నే గుర్తించేందుకు వీలుంటుంద‌ని వెల్ల‌డించింది. ఈ విధానాన్ని అతి త్వ‌ర‌లోనే అమ‌లులోకి తీసుకురానున్న‌ట్లు ఫెడ‌రల్ నేష‌న‌ల్ కౌన్సిల్ స్ప‌ష్టం చేసింది. దీంతో ఎవ‌రైనా ఏజెంట్ ప‌వ‌ర్ ఆఫ్ ఆటార్నీని దుర్వినియోగం చేస్తూ ఆస్తుల‌ను అక్ర‌మంగా అమ్మాల‌ని ప్ర‌య‌త్నిస్తే వారిని వెంట‌నే గుర్తించి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంద‌ని ఫెడ‌ర‌ల్ నేష‌న‌ల్ కౌన్సిల్ వెల్ల‌డించింది.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com