ఆంబులెన్స్ నుంచి మొబైల్ ఫోన్ చోరీ..ఇద్ద‌రు అరెస్ట్

- April 06, 2021 , by Maagulf
ఆంబులెన్స్ నుంచి మొబైల్ ఫోన్ చోరీ..ఇద్ద‌రు అరెస్ట్

సౌదీ:ఓవైపు ఆప‌ద‌లో ఆదుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటే..మ‌రోవైపు సంద‌ట్లో స‌డేమియాలా ఇద్ద‌రు వ్య‌క్తులు చేతివాటం చూపించారు. ఏకంగా ఆంబులెన్స్ లో నుంచి మొబైల్ ఫోన్ ను దొంగిలించారు. సౌదీ అరేబియాలోని త‌బుక్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆంబులెన్స్ లోని వైద్య సిబ్బంది ఆప‌ద‌లో ఉన్న ఓ వ్య‌క్తికి చికిత్స చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైపోయారు. ఇదే అద‌నుగా భావించిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఆంబులెన్స్ నుంచి మొబైల్ చోరీ చేశారు. అయితే..వారి బాగోతం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవ‌టంతో ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల బండారం బ‌య‌ట‌ప‌డింది. పూటేజ్ ఆధారాల‌తో ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు నిందితుల‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్ద‌రి వ‌య‌సు 30 ఏళ్లు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com